Prabhas's Rebel Highlight Dialogue






ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం రెబెల్. ఈ చిత్రంలో డైలాగులకు అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రెండు డైలాగులు..

"ఒక్కడు ఎదరు తిరిగితే తిరుగుబాటు....అదే వంద మంది ఎదురు తిరిగితే అది పోరాటం"

"చరిత్రలో నిలచిపోయిన ఏ పోరాటం అయినా, వెనక ఉన్న వంద మంది గురించి చెప్పుకోలేదు... ముందుండి నడిపించిన ఒక్కడిని గురించి మాట్లాడుకున్నారు"


షూటింగ్ టైమ్ లోనే నాకు మంచి కిక్ ఇస్తున్న సినిమా ఇది. లారెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా తీస్తున్నాడు. నా ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయి.ఇందులో నా లుక్ డిఫరెంట్‌గా ఉంటుంది. టైటిల్‌కి తగ్గట్టుగా స్టైలిష్‌గా, పక్కా మాస్‌గా ఉంటుందీ సినిమా అని ప్రభాస్ చెప్తున్నారు. ఇక దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ...‘రెబల్’ అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ‘రెబల్’ అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి’. ఆ సినిమాను మించే స్థాయిలో మా ‘రెబల్’ ఉంటుంది అన్నారు. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ -‘‘డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ లాంటి విజయాల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రభాస్‌కి హ్యాట్రిక్ హిట్‌గా నిలుస్తుంది. తమన్నా, దీక్షాసేథ్ గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. ఏ విషయంలోనూ రాజీ పడకుండా లారెన్స్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 15 నుంచి జరిగే మూడో షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుంది. హైదరాబాద్, బ్యాంకాక్, వైజాగ్‌ల్లో ఈ షెడ్యూల్ చేస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే ‘రెబల్’ హై బడ్జెట్ ఫిలిం అవుతుంది’’ అని చెప్పారు. ‘ఈ చిత్రానికి సంగీతం: తమన్ , కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్’స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

Read Users' Comments (0)

0 Response to "Prabhas's Rebel Highlight Dialogue"

Post a Comment